- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను నిర్లక్ష్యం చేస్తున్నడు.. చావు ఒక్కటే మార్గం.. పవర్ స్టార్ పవన్ భార్య పోస్ట్..
భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరోయిన్ అంజలి రాఘవ్ మ మ నడుమును అసభ్యకరంగా తాకి చిక్కుల్లో పడ్డాడు. దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరోయిన్ అంజలి రాఘవ్ మ మ నడుమును అసభ్యకరంగా తాకి చిక్కుల్లో పడ్డాడు. దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో సదరు నటి భోజ్‌పురి ఇండస్ట్రీ నుంచి క్విట్ అవుతున్నట్లు ప్రకటించగా.. పవన్‌పై మరింత ట్రోలింగ్ జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే.. పవన్ రెండో భార్య జ్యోతి సింగ్.. ఈ టైమ్‌లోనే క్రిప్టిక్ నోట్ పోస్ట్ చేసింది. తనను భర్త నెగ్లెక్ట్ చేస్తున్నట్లు.. ఎమోషనల్ పెయిన్‌తో బాధపడుతున్నట్లు ఇందులో పేర్కొంది.
దాదాపు ఏడేళ్లుగా తను భర్తకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నిసార్లు కాల్ చేసినా.. లిఫ్ట్ చేయట్లేదని తెలిపింది. భర్త అడుగుజాడల్లో నడిచిన తాను ఇంత శిక్ష అనుభవించేందుకు.. ఏం తప్పు చేశానో చెప్పాలని బాధపడింది. తన తండ్రి వెళ్లి కలిపేందుకు ప్రయత్నించినా.. ఫలితం శూన్యంగా ఉందన్న ఆమె.. ఇక తనకు ఓపిక లేదని, సజీవదహనం చేసుకోవడం ఒక్కటే దారని.. కానీ తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందనే ఆ పని చేయలేదని చెప్పుకొచ్చింది జ్యోతి.






