- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూజాకు బంపర్ ఆఫర్... 100 కోట్ల హీరో సినిమాలోనే ఛాన్స్ !
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు బంపర్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లక్కీ భాస్కర్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు బంపర్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లక్కీ భాస్కర్ లాంటి బంపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ తో పూజా హెగ్డే సినిమా చేయబోతున్నారట. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ప్రేమ కథ సినిమా రాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాను రవి అనే కొత్త దర్శకుడు తీస్తున్నట్లు తెలుస్తోంది.
SLN సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ సిద్ధమైందట. కానీ దుల్కర్ సల్మాన్ డేట్స్... కారణంగా సినిమా ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. అటు ఈ సినిమా చేసేందుకు పూజా హెగ్డే ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దుల్కర్ సల్మాన్ సినిమా చేశాడంటే మినిమం గ్యారంటీ హిట్టు ఉంటుంది. దీంతో పూజా హెగ్డే పంట పండినట్లేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా... తెలుగులో ఆచార్య సినిమా తర్వాత పూజ హెగ్డే కు అవకాశాలే రాలేదు. వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 లో స్పెషల్ సాంగ్ చేశారు పూజా హెగ్డే. ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా పూజ హెగ్డేనే మొదట హీరోయిన్ గా అనుకొని ఆ తర్వాత తప్పించారట. దీంతో అప్పటి నుంచి పూజ హెగ్డే కు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో దుల్కర్ సల్మాన్ తో సినిమా రావడం... మంచి పరిణామం అంటున్నారు.






