Bro Movie : ‘శ్యాంబాబు’ ఆ ఏపీ మంత్రినా బ్రో.. సోషల్ మీడియాలో వైరల్..!

by Disha Web Desk 13 |
Bro Movie : ‘శ్యాంబాబు’ ఆ ఏపీ మంత్రినా బ్రో.. సోషల్ మీడియాలో వైరల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బ్రో’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. వింటేజ్ పవన్ స్క్రీన్‌పై కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. మూవీలో పవన్ ఓల్డ్ మూవీ సాంగ్స్‌తో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌ని విపరీతంగా అలరించాయి. కాగా పవన్ గత చిత్రాలు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌లో పొలిటికల్ పరంగా డైలాగ్స్ వినిపించాయి.

అయితే ఈ మూవీ రచయిత త్రివిక్రమ్.. ఒక రెండు సీన్స్‌లో పొలిటికల్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీలోని రెండు సన్నివేశాలు చూసిన ఆడియన్స్ ఏపీ రాజకీయాలకి లింక్ చేస్తున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ ఈ సినిమాలో ‘శ్యాంబాబు’ అనే పాత్రని పోషించగా.. ఈ శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు అంటూ.. నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అంబటి డాన్స్ చేసిన ఒక వీడియోని, ఈ మూవీలో శ్యాంబాబుగా పృథ్వీ చేసిన డాన్స్ వీడియోని కలిపి ఎడిట్ చేసి ఒకేలా ఉన్నాయి అంటూ.. ''ఆ శ్యాంబాబు అంబటి రాంబాబునా బ్రో'' అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.



Next Story

Most Viewed