అనిల్ రావిపూడిపై పోలీసు కేసు.. జైలుకి వెళ్లి చిప్పకూడు తినడానికి నేను రెడీ అంటూ షాకింగ్ రియాక్షన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-14 08:29:25  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.

అనిల్ రావిపూడిపై పోలీసు కేసు.. జైలుకి వెళ్లి చిప్పకూడు తినడానికి నేను రెడీ అంటూ షాకింగ్ రియాక్షన్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. నయనతార హీరోయిన్ నటించగా.. వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ.. బాక్సాఫీసు వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతోంది. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతోంది. ఇక మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్‌ను పొగడటంతో పాటు అనిల్ రావిపూడిపై తమ అభిమానం చూపిస్తూ ఆశ్చర్యపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉండగా..తాజాగా, థాంక్యూ మీట్‌లో పాల్గొన్న అనిల్ రావిపూడికి ఊహించని ప్రశ్న ఎదురవగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘‘కొంతమంది మహిళలు మీపై కేసు పెట్టాలని అనుకుంటున్నారు’’ అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి అనిల్ రావిపూడి రియాక్ట్ అవుతూ.. నేను మహిళల కోసం జైలుకు వెళ్లడానికి రెడీ.. చిప్పకూడు తినడానికి రెడీ.

అవసరమైతే ఊచలు లెక్కపెట్టడానికి, ఊరి శిక్షకు కూడా సిద్ధమే’’ అని అనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మెగా అభిమానులు చూపిస్తున్న అభిమానం గురించి చెప్తూ.. కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే, నేను కనిపిస్తే నన్ను లాక్కెళ్లి ముద్దు పెట్టేద్దాం అని చూసారని నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా.. తాను ప్రేక్షకులకు గట్టిగా దొరికేశానని చెప్తూ.. ‘‘సోషల్ మీడియాలో గత పదిహేను రోజులుగా అనిల్ రావిపూడి దొరుకుతాడా.. దొరకడా అనే విధ్వంసం జరిగింది..! గట్టిగా దొకేశాను.. ప్రేక్షకులకు దొరికాను.. టికెట్ కొని ఈ సినిమాని చిరంజీవి గారిని చూడాలి.. మా చిరు హిట్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి.. ఎంటర్‌టైన్ అవ్వాలని అనుకునేవారికి గట్టిగా దొరికాను. ఈసారి సంక్రాంతికి కూడా నాకు మోమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు.మీమ్స్ ఫ్రెండ్స్ అందరూ ఏసుకునేవాళ్లు ఏసుకోండి..పొగుడుకునేవాళ్లు పొగుడుకోండి.. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను’’ అని అన్నారు.

Read More... మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటోస్

మన శంకర వరప్రసాద్ గారు' రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందంటే..? పోస్ట్ వైరల్

Next Story