దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అంటూ శ్రద్దా కపూర్ షాకింగ్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-24 12:26:02  IST  )

బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్(Shraddha Kapoor) గత ఏడాది ‘స్త్రీ-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అంటూ శ్రద్దా కపూర్ షాకింగ్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్(Shraddha Kapoor) గత ఏడాది ‘స్త్రీ-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఓ హారర్ డ్రామాతో పాటు ‘స్త్రీ-3’ (stree-3)లోనూ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రద్దా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రియమైన LinkedIn @linkedin_in, లింక్డ్ఇన్ నకిలీదని భావించడం వలన నేను నా స్వంత ఖాతాను ఉపయోగించలేకపోతున్నాను. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయగలరా? ఖాతా తయారు చేయబడింది సిద్ధంగా ఉంది. ప్రీమియం, ధృవీకరించబడింది. కానీ ఎవరూ దానిని చూడలేరు. నా వ్యవస్థాపక ప్రయాణాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఖాతాను ప్రారంభించడం ఒక ప్రయాణంగా మారింది’’ అని రాసుకొచ్చింది. LinkedIn తన అకౌంట్ ఫేక్ అనుకోవడం వల్ల తన అకౌంట్ వాడలేకపోతున్నట్లు ఎలాగైనా సాయం చేయాలంటూ కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story