అనూహ్యంగా ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి పవన్ కల్యాణ్ ‘OG’.. ఎందుకంటే?

by Disha Web Desk 2 |
అనూహ్యంగా ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి పవన్ కల్యాణ్ ‘OG’.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ సినిమాపైనే ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్ లుక్స్‌, గ్లింప్స్‌, టీజర్ ఫ్యాన్స్‌ను ఆకట్టున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. అయితే, సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ లేకుండా అనూహ్యంగా ‘ఓజీ’ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ నటించిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు సరైన సినిమా పడటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సలార్ చిత్రాన్ని వీక్షించిన పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చారు.. ఇక పవన్ కల్యా్ణ్ ఇవ్వడమే మిగిలి ఉంది. ఓజీ సినిమాతో అన్నీ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. డైరెక్టర్ సుజిత్‌పై తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. సినిమాకు యావరేజ్ టాక్ ఉన్నా చాలు.. పవర్ స్టార్ ఊచకోతను ఎవరూ ఆపలేరు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు, కామెంట్లు పెడుతూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

Next Story

Most Viewed