- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramayana: మూవీలో కీలక పాత్ర కొట్టేసిన ‘పంచాయత్’ నటుడు
ఈ చిత్రానికి సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో రావణుడి (యష్) తమ్ముడు, పాత్ర ‘పంచాయత్’ సిరీస్ ఫేమ్ ఫైజల్ మాలిక్ దక్కించుకున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana) . ఇందులో సాయి పల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో రావణుడి (యష్) తమ్ముడు, కుంభకర్ణుడి పాత్ర ‘పంచాయత్’ సిరీస్ ఫేమ్ ఫైజల్ మాలిక్ దక్కించుకున్నట్లు సమాచారం. ముంబైలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోలో కుంభకర్ణుడి ఇంట్రడక్షన్ సీన్‌ను అంతర్జాతీయ యాక్షన్ క్రూ సమక్షంలో ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసం భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారని, హాలీవుడ్ మూవీ ‘అవతార్’ రేంజ్ విజువల్స్ ఇందులో కనిపిస్తాయని టాక్. కుంభకర్ణుడి పాత్రకు తగ్గ ఎత్తు, భారీ శరీరాకృతి ఫైజల్ మాలిక్‌కు ఉండటంతో ఆయనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని మేకర్స్ భావించి అతన్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. కాగా.. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తుండటం సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ ఏడాది దీపావళికి ఈ మహా కావ్యం మొదటి భాగం థియేటర్లలోకి రానుంది.






