- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆది ‘శంబాల’ ట్రైలర్ లాంచ్ చేయనున్న పాన్ ఇండియా స్టార్.. వీడియోతో భారీ హైప్
సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ చిత్రం ‘శంబాల’(Shambhala)’.

దిశ, సినిమా: సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ చిత్రం ‘శంబాల’(Shambhala)’. యుగంధర్ ముని(Yugandhar Muni) దర్శకత్వం వహిస్తుండగా.. రాజశేఖర్, అన్నభీమోజు, మహీధర రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar)ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అర్చన అయ్యర్, శ్వాసిక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే వచ్చిన అన్ని అప్డేట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్.
ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా.. విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘శంబాల’ ట్రైలర్ నవంబర్ 1న ఉదయం 11:05 గంటలక రాబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుపుతూ డార్లింగ్ అన్ని సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. చివరగా.. ఆది ‘శంబాల’ సీన్స్‌ను జత చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ప్రభాస్, ఆదికి సపోర్ట్‌గా ఉండటంతో ‘శంబాల’ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.






