- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా నిజమైన ప్రయాణం మొదలైంది.. విజయ్ సేతుపతి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi), టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi), టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఇందులో డైనమిక్ విలన్‌గా స్టార్ హీరోయిన్ టబు నటిస్తుండగా.. శాండల్‌వుడ్ డైనమో యాక్టర్ విజయ్ కుమార్, రాధికా అప్డేట్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ కూడా పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఇందులోంచి వచ్చే అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. నేడు హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం అయినట్లు కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ‘‘మా నిజమైన ప్రయాణం ఈరోజు హైదరాబాద్‌లోని సెట్‌లో స్టార్ట్ అయింది. కీలక సన్నీవేశాలు చిత్రీకరించబోతున్నాం.
రెగ్యులర్‌గా షూటింగ్ జరగబోతుంది. మక్కల్ సెల్వన్, సంయుక్త మీనన్‌కు సంబంధించిన కీలకమైన సీన్స్‌ను చేయబోతున్నాం’’ అని రాసుకొచ్చారు. అలాగే ఫైర్ ఎమోజీలు షేర్ చేశారు. ఇక ఈ ఫొటోల్లో సంయుక్త లంగా ఓణిలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చార్మీ కౌర్ బ్లాక్ డ్రెస్ గాగుల్స్ పెట్టుకుని ఫుల్ స్వింగ్‌లో కనిపించి ప్రేక్షకుల్లో ఎక్జైట్‌మెంట్‌ను పెంచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






