Oscars 2023: అకాడమీ అవార్డు ఓటు వేసిన AR Rahman

by Dishanational4 |
Oscars 2023: అకాడమీ అవార్డు ఓటు వేసిన AR Rahman
X

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్స్ 2023 కోసం తన అకాడమీ అవార్డు ఓటు వేసినట్లు తెలిపాడు. 2009లో రెండు అవార్డులు గెలుచుకుని 2011లో నామినేట్ అయిన ఈ సంగీత మేధావి.. రాబోయే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు 95వ ఎడిషన్ కోసం ఓటు వేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు అకాడమీ నుండి వచ్చిన నోటిఫికేషన్ స్క్రీన్‌ షాట్‌ను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేయగా.. 'థ్యాంక్యూ. మీ బ్యాలెట్ మాకు అందింది. సభ్యులు తమ ఓటింగ్ నిర్ణయాలను గోప్యంగా ఉంచాలని నిర్వాహణ కమిటీ అభ్యర్థిస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఈ సందేశం పోటీదారులకు న్యాయం చేయడానికి చాలా అవసరం' అని ఆస్కార్ అకాడమీ రిప్లై ఇచ్చింది. అయితే ఈ 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' సభ్యుల ఓటింగ్ విధానం ద్వారానే నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేస్తారు. ఈ 95వ అకాడమీ అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లు 2023 జనవరి 24న ప్రకటిస్తారు.

Next Story