అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన ‘ది కేరళ స్టోరీ’ OTT రిలీజ్ డేట్..

by Dishafeatures1 |
అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన ‘ది కేరళ స్టోరీ’ OTT రిలీజ్ డేట్..
X

దిశ, సినిమా: ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా వచ్చి గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో టాలివుడ్ నటి అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. కథ ప్రకారం కేరళకు చెందిన 32,000 మంది హిందూ అమ్మాయిలను మోసపూరితంగా కొందరు ఇస్లాం మతం లోకి మార్చి.. ఐసిస్‍లోకి పంపారని ఈ సినిమా లో చూపించడం తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ మూవీని థియేటర్ లో ఎక్కువ రోజులు అడనివ్వకపోవడంతో చాలా మంది మిస్ అయ్యారు. దీంతో అప్పటి నుంచీ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా మొత్తానికి ఎన్నో అడ్డంకుల తర్వాత జీ5 (Zee 5) ఓటీటీలో ఫిబ్రవరి 16 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ .. జీ5 ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

Next Story