ఆఫర్లు లేక అలా చేసిందంటూ ..సిరి హనుమంతు‌పై నూకరాజు షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 8 |
ఆఫర్లు లేక అలా చేసిందంటూ ..సిరి హనుమంతు‌పై నూకరాజు షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ఇక తాజాగా ఈ షోకు బిగ్ బాస్ ఫేమ్ సిరిహనుమంతు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సిరికి ఆఫర్లు లేక ఆ పని చేసిందంటూ.. ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ చేశారు.

అయితే తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల చేయగా, అందులో నూకరాజు తన స్కిట్‌లో చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపస్తాడు. స్కిట్‌లో భాగంగా జడ్జ్‌గా ఉన్న కృష్ణ భగవాన్ పై పంచులు వేసి నవ్విస్తాడు. ఆయనకు షూటింగ్ కు వెళ్ళడానికి టైమ్ అవుతుంది, త్వరగా చెప్పులు ఇంటికి పంపించాలి అంటూ త్వర త్వరగా కవర్ ఓపెన్ చేసి చెప్పులను బయటకు తీస్తాడు. చూసే సరికి అందులో ఒకటి అమ్మాయిది, మరొకటి అబ్బాయి చెప్పు ఉంటుంది. దీంతో అయ్యో ఆయన రాత్రి హడావిడిగా కన్ఫ్యూజ్ అవడం వలన ఇలా పంపినట్లు ఉన్నాడంటూ సరదాగా జోక్ చేస్తారు. అలాగే తర్వాత ఇంకో జత చెప్పులు తీసుకుని ఇవి ఎవరి చెప్పులు ఇలా అరిగిపోయాయని మరో కమెడియన్ అడగగా, దానికి నూకరాజు సమాధానం ఇస్తూ.. సిరివి.. అవకాశాల కోసం తిరిగి తిరిగి ఇలా అయిపోయాయి అంటూ చెప్తాడు. మరి అవకాశం వచ్చిందా అని అడగ్గా మోకాళ్ళు అరిగిపోయాయి అంటూ పంచ్ వేస్తాడు. ప్రస్తుతం స్కిట్‌లో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చాక చాలా మందికి ఆఫర్స్ రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి.. సిరి కూడా అలాంటి సిట్యువేషన్ ఫేస్ చేసింది. ఆఫర్లు లేక ఆమె చెప్పుల అరిగేలా తిరిగిదంటూ నూకరాజు ఇన్ డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Next Story