- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న నోరా.. ధృవ సర్జా సినిమా అప్‌డేట్ వైరల్
ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషన్ నోరా ఫతేహి ఒక ప్రత్యేక గీతంలో మెరవబోతోంది. దీనికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌లో నోరా ఎరుపు రంగు దుస్తుల్లో ‘మిర్చి’లాంటి ఘాటు అందాలతో కనిపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

దిశ, సినిమా: కన్నడ యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కెడీ - ది డెవిల్’ (KD: The Devil) నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా చిత్రబృందం ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషన్ నోరా ఫతేహి ఒక ప్రత్యేక గీతంలో మెరవబోతోంది. దీనికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌లో నోరా ఎరుపు రంగు దుస్తుల్లో ‘మిర్చి’లాంటి ఘాటు అందాలతో కనిపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ ప్రత్యేక గీతం ‘సర్సె.. నిన్నా సిరాగే సర్సే’ మార్చి 14వ తేదీ సాయంత్రం 5:05 గంటలకు విడుదల కానుంది. నోరా డ్యాన్స్, ధృవ సర్జా మాస్ స్టెప్పులతో ఈ పాట థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమాలో రిష్మా నానయ్య హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, సీనియర్ నటి శిల్పాశెట్టి, కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 1970ల కాలం నాటి బెంగళూరు గ్యాంగ్‌స్టర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం యాక్షన్ ప్రియులకు కనువిందు చేయనుంది.






