కాబోయే భర్త విషయంలో నో కాంప్రమైజ్.. చర్చనీయాంశంగా మారిన మీనాక్షి చౌదరి కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-13 08:47:38  IST  )

గత కొద్ది కాలంగా క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కాబోయే భర్త విషయంలో నో కాంప్రమైజ్.. చర్చనీయాంశంగా మారిన మీనాక్షి చౌదరి కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం నడిపిస్తుందంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మీనాక్షి చౌదరి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్తూ.. పలు షాకింగ్ కండీషన్లు పెట్టింది. నా భర్త డాక్టర్, నటుడు లేదా మిస్టర్ ఇండియా మాత్రం అసలు కాకూడదని స్పష్టం చేసింది. ఎందుకంటే తాను ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నాని ఇంట్లో మరోసారి అదే ప్రొఫేషన్‌కు సంబంధించిన వ్యక్తి అవసరం లేదని చెప్పింది.

అలాగే తన పార్ట్‌నర్‌కు 100 ఎకరాల రాజ్మా పొలాలు ఉండాలని, ఇంటి పనులైన వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటివి తెలిసి ఉండాలని కండీషన్స్ పెట్టింది. ఇక తనకు కాబోయే భర్త రిలేషన్‌షిప్స్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడింది. అబ్బాయికి గతంలో 3.5 బ్రేకప్స్ ఉన్నా పర్వాలేదని, తనకు కాబోయే భర్త పొడవుగా ఉండటంతో పాటు మూడుసార్లు గిఫ్ట్స్ ఇచ్చేవాడినే పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. తనకు పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా మీనాక్షి చౌదరి సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ అమ్మడు ఫుల్ ఫామ్‌లో ఉంది. త్వరలో ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Read More..

ఇండస్ట్రీలో కొందరు డబ్బులు ఖర్చు చేసి ఇతరులను కిందికి లాగేందుకు చూస్తున్నారు.. తాప్సీ ఘాటు వ్యాఖ్యలు

Next Story