‘‘మాట పోయి మనిషి బ్రతికినా మనిషి పోయినట్టే లెక్క’’ అంచనాలు పెంచేస్తున్న ‘తమ్ముడు’ ట్రైలర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-28 15:30:28  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ఇటీవల ‘రాబిన్‌హుడ్’ (Robinhood)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయింది.

‘‘మాట పోయి మనిషి బ్రతికినా మనిషి పోయినట్టే లెక్క’’ అంచనాలు పెంచేస్తున్న ‘తమ్ముడు’ ట్రైలర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ఇటీవల ‘రాబిన్‌హుడ్’ (Robinhood)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హిట్ సినిమా టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘తమ్ముడు’ (thammudu) పేరుతో రాబోతున్న ఈ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో సప్తమి గౌడ(Sapthami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. లయ కీలక పాత్రలో కనిపించనుంది.

అయితే ఈ సినిమాను svc బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ‘‘మాట పోయి మనిషి బ్రతికినా మనిషి పోయినట్టే లెక్క... మాట బ్రతికి మనిషి పోతే మనిషి బతికున్నట్టే లెక్క’’ అని నితిన్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా, ఈ సినిమాతో పాటు నితిన్ వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ మూవీ కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click For Video..

Next Story