- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితిన్-రితికా నాయక్ కాంబో ఫిక్స్.. షూటింగ్ అప్డేట్ ఇస్తూ అధికారిక ప్రకటన చేసిన చిత్రబృందం
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నితిన్ కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. ‘ప్రొడక్షన్-43’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.

దిశ, సినిమా: వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్, ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘భీష్మ’ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించకపోవడంతో, కథల ఎంపికలో అచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. ‘ప్రొడక్షన్-43’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, జానీ షేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. మే రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో నితిన్ సరసన రితికా నటిస్తుందని పలు పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, పూజా కార్యక్రమాల్లో రితికా నాయక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో ఆ పుకార్లన్నీ నిజమే అని తేలిపోయింది. వైట్ కలర్ చీరలో దేవకన్యలా మెరిసిపోయిన రితికాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రితికా, ఇప్పుడు నితిన్‌తో జోడీ కట్టడంపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నితిన్ ఎనర్జీకి, రితికా నాయక్ అభినయం తోడైతే స్క్రీన్ మీద మ్యాజిక్ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో సినిమా రాబోతుండటంతో నితిన్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ‘ప్రొడక్షన్-43’ నితిన్ కెరీర్‌కు ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.






