- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిహారిక, విశ్వక్ సేన్ రొమాంటిక్ వీడియో.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఇదే..
నిహారిక కొణిదెల మెగా డాటర్‌గా సినిమాల్లోకి ఎంటర్ అయింది. కానీ నటిగా ప్రూవ్ చేసుకునే లోపే.. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులతో కెరీర్ రీస్టార్ట్ చేసినా.. నిర్మాతగానే సెటిల్ అయిపోయింది. అయితే హీరోయిన్‌గా చేసిన

దిశ, వెబ్ డెస్క్ : నిహారిక కొణిదెల మెగా డాటర్‌గా సినిమాల్లోకి ఎంటర్ అయింది. కానీ నటిగా ప్రూవ్ చేసుకునే లోపే.. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులతో కెరీర్ రీస్టార్ట్ చేసినా.. నిర్మాతగానే సెటిల్ అయిపోయింది. అయితే హీరోయిన్‌గా చేసిన రెండు మూడు సినిమాల్లో యావరేజ్ అనిపించుకున్న నిహారిక.. నిర్మాతగా మాత్రం వావ్ అనిపిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. విశ్వక్ సేన్‌తో సినిమా చేయని నిహారికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో ఓ గోడ పక్కన నిల్చున్న ఇద్దరు సిగ్గుపడుతున్నారు. నిహారిక గిలిగింతలు పెడుతుంటే.. విశ్వక్ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోయాడు. అయితే ఇలాంటి వీడియో బయటకు రావడంతో.. ఈ సినిమా ఎక్కడిది? ఇదంతా ఎప్పుడు జరిగింది? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు వీరిద్దరు ఒకే కాలేజీలో చదువుకుని ఉంటారని.. ఆ టైంలో తీసిన షార్ట్ ఫిల్మ్ అయ్యుండొచ్చని చెప్తున్నారు. మొత్తానికి ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరిందని అభిప్రాయపడుతున్నారు.






