- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మిత్ర మండలి’ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన నిహారిక..
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi)వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi)వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి ‘మిత్ర మండలి’(MithraMandali ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్(Vijayender S) ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో ప్రియదర్శి సరసన సోషల్ ఇన్లుఫ్లూయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ‘మిత్ర మండలి’ కి సంబంధించిన పోస్టర్లు, టీజర్, సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘మిత్ర మండలి’ అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్ ‘స్వేచ్ఛ స్టాండు’ ఆగస్టు 1 సాయంత్రం 5:04 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ చిన్న వీడియోను షేర్ చేసింది. ఇక దానిని నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది.






