‘మిత్రమండలి’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిహారిక.. దీపావళికి బ్లాస్ట్ చేయబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-01 16:05:48  IST  )

యంగ్ హీరోయిన్ నిహారిక ఎన్‌ఎమ్(Niharika NM) ‘పెరుసు’ చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

‘మిత్రమండలి’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిహారిక.. దీపావళికి బ్లాస్ట్ చేయబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నిహారిక ఎన్‌ఎమ్(Niharika NM) ‘పెరుసు’ చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. నిహారిక ‘మిత్రమండలి’(MithraMandali ) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇందులో ప్రియదర్శి(Priyadarshi), విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో విజయేందర్ (Vijayender)దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సొంత నిర్మాణ సంస్థ బివి వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘మిత్రమండలి’ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘మిత్రమండలి’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ సినిమా నవ్వులతో దీపావళి పండుగను చేసుకునేలా అక్టోబర్ 16న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ‘‘మా క్రేజీ దుష్ట ముఠాను కలిసేందుకు సిద్ధంగా ఉండండి.

అక్టోబర్ 16న మీ ముందుకు రాబోతున్నారు. ఈ దీపావళికి ‘మిత్రమండలి’ సరదా బాంబులతో, నవ్వులతో బాక్సాఫీసును బ్లాస్ట్ చేయబోతోంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక పోస్టర్‌.. గ్యాంగ్ ఉత్సాహభరితమైన శక్తితో నిండిన వాతావరణాన్ని కలిగి ఉండగా.. బాణసంచా పేల్చిన సమయంలో టీమ్ అంతా నవ్వుతున్న పోస్టర్ వస్తుంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సూపర్ ఎక్జైటెడ్‌గా ఉన్నాము. మేము ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Next Story