Niharika Konidela: గుడ్ న్యూస్ ప్రకటించిన నిహారిక.. కొత్త జర్నీ స్టార్ట్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |

మెగా డాటర్ నిహారిక (niharika) ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో నటించింది.

Niharika Konidela: గుడ్ న్యూస్ ప్రకటించిన నిహారిక..  కొత్త జర్నీ స్టార్ట్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక (niharika) ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో నటించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసింది. ఇక ఆమె నిర్మించిన మొదటి మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu )సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో నిహారిక రేంజ్ ఒక్కసారిగా ఊహించని రేంజ్‌కు వెళ్లింది. ప్రస్తుతం నిర్మాతగానే ఇండస్ట్రీలో రాణిస్తోంది. తన సెకండ్ ప్రాజెక్ట్ సంగీత్ శోభన్‌(Sangeet Shobhan)తో చేస్తోంది. దీనికి మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఫ్యాంటసీ కామెడీ జోనర్‌తో రాబోతుంది. ఇందులో నయన్ సారిక(Nayan Sarika) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్(Vennela Kishore), బ్రహ్మజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ్ బిక్షు, రమణ భార్గవ్, వాసు ఇటూరి, రోహిణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైనట్లు టాక్.

నిహారిక ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు పెడుతూ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక కొత్త జర్నీ స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో తన ఫ్రెండ్ భాగితో కలిసి ఓ వంటకాన్ని తయారుచేస్తూ కనిపించింది. కొత్త కదా అని స్నేహితురాలిని అందరికీ పరిచయం చేసింది. దీంతో ఆమె కూడా తను నీహా పాత కదా అని చెప్పింది. ఇక ఇద్దరు కలిసి ప్రేమతో వంట చేస్తున్నామంటూ వెల్లడించారు. వీడియోలు స్టార్ట్ చేయబోతున్నట్లు త్వరలోనే ఫస్ట్ ఎపిసోడ్ రాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ నిహారిక ఇందులోనూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Next Story