స్టార్ హీరోయిన్ కూతురు సర్జరీ.. 13 ఏళ్లకే అవసరమా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

by I. Sairam |

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్(Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్(Abhishek bachchan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

స్టార్ హీరోయిన్ కూతురు సర్జరీ.. 13 ఏళ్లకే అవసరమా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్(Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్(Abhishek bachchan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. టాప్ హీరోయిన్‌గా కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఐశ్వర్య అభిషేక్‌తో ప్రేమలో పడి ఇరు కుటుంబాలను ఒప్పించి బిగ్ బి ఫ్యామిలీలోకి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ జంటకు ఆరాధ్య(Aaradhya) అనే పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆరాధ్య బచ్చన్ తల్లితో సమానంగా గ్లామర్‌లో పోటీ పడుతున్నదేమో అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆరాధ్య బచ్చన్‌ను ఓ చిన్న పిల్లలా భావించినప్పటికీ రీసెంట్ వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే .. తల్లి ఐష్ కంటే ఆరాధ్య బచ్చన్ ఇంకా క్యూట్ అండ్ గ్లామర్ ఫిగర్‌లా కనిపిస్తోంది.

అయితే ఆమె అలా అందంగా కనిపించడానికి కారణం సర్జరీ చేయించుకుందని ఓ పుకారు నెట్టింట షికారు చేస్తుంది. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్ అయింది. కానీ, ఇప్పుడు ఒక హీరోయిన్ సర్జరీ చేయించుకుంది అంటే అదంతా కామన్.. కానీ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యకు సర్జరీ చేయించిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్‌గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై కొందరు నెటిజన్లు 13 ఏళ్లకే సర్జరీలు అవసరమా అంటుంటే మరికొందరు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు.

Next Story