విజయశాంతి ముందు నయనతార పనికిరాదు.. స్టార్ సీరియల్ నటి సంచలన కామెంట్స్!

by Kodari Anjali |   (  Updated:2023-08-13 14:34:49  IST  )

ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ ఫేమ్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

విజయశాంతి ముందు నయనతార పనికిరాదు.. స్టార్ సీరియల్ నటి సంచలన కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ ఫేమ్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా.. ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘స్టార్ హీరోయిన్ అనిపించుకునే అర్హత అందరికీ ఉండదు. ఇక లేడీ సూపర్ స్టార్ అని అందరూ నయనతారను పిలుస్తారు. కానీ, ఆ బిరుదు ఆమెకు సరిపోదు. నా దృష్టిలో కేవలం విజయశాంతి మాత్రమే. ఆమె ముందు నయనతార ఎందుకూ పనిరాదు. దయచేసి తనను విజయశాంతితో కంపేర్ చేయొద్దు. విజయ్, అజిత్ లాంటి ఎంతమంది అగ్ర హీరోలున్నా సరే రజినీకాంత్ ముందు వారంతా తక్కువే. అలాగే హీరోయిన్లలో విజయశాంతి పేరు ప్రతిష్టలు వేరు.. నయనతార వేరు అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి చేసిన వ్యాఖ్యలకు నయన్ అభిమానులు మండిపడుతున్నారు. ఎప్పుడూ నయనతార మీద పడి ఏడ్వడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story