రికార్డ్ సృష్టించిన నాని.. భారీ ధరకు ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రైట్స్..

by Dishafeatures1 |
రికార్డ్ సృష్టించిన నాని.. భారీ ధరకు ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రైట్స్..
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ‘హాయ్ నాన్న’ నాని కి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. తండ్రి పాత్రలో నాని అందరినీ ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేటెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఏమిటంటే, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ మూవీ సౌత్, నార్త్ మొత్తం ఓటీటీ రైట్స్ ని రూ. 45 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది నాని కెరీర్ లోనే ఇది హైయెస్ట్ అని అంటున్నారు. ఇక ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.



Next Story

Most Viewed