- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవి పేరు పెట్టడం నా మనసును కదిలించింది.. చిరు ఎమోషనల్ పోస్ట్
సంస్కృతిని, దైవ చింతనను ప్రతిబింబించేలా ఈ పేర్లను ఎంపిక చేసిన చరణ్, ఉపాసనలను చూస్తుంటే గర్వంగా ఉంది.

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన (Upasana)దంపతుల ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే వీరికి 'క్లిన్ కారా' అనే కుమార్తె ఉండగా, ఇప్పుడు మరో ఇద్దరు పిల్లలు తోడయ్యారు. దీంతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్నట్లే, చరణ్‌కు కూడా ముగ్గురు సంతానం (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) తో చిరంజీవి వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఫిబ్రవరి 11న ఈ చిన్నారులకు బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల మరియు కామినేని కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకలో బాబుకి ‘శివరామ్ కొణిదెల’ అని, పాపకి ‘అన్వీరా దేవి’ అని పేర్లు పెట్టారు. ఈ కాలంలో అందరూ వింత పేర్ల కోసం వెతుకుతుంటే, చరణ్ దంపతులు మాత్రం మన సంప్రదాయానికి, భక్తికి విలువనిస్తూ ఈ పేర్లను ఎంచుకోవడం విశేషం.
అది చాలా గొప్ప విషయం
మనవడు, మనవరాలి పేర్లు అందరికీ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన సంతోషాన్ని పంచుకున్నారు. తాజాగా, ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘మా మనవడు, మనవరాలి పేర్లు చాలా బాగున్నాయని నా స్నేహితులు, బంధువుల నుండి చాలా ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి. మన సంస్కృతిని, దైవ చింతనను ప్రతిబింబించేలా ఈ పేర్లను ఎంపిక చేసిన చరణ్, ఉపాసనలను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ముఖ్యంగా పాప పేరులో చరణ్ నానమ్మ అంజనా దేవి పేరులోని ‘దేవి’ అనే పదాన్ని చేర్చడం నన్ను బాగా కదిలించింది. తన నానమ్మపై ఉన్న గౌరవంతో పాప పేరులో ‘దేవి’ అని వచ్చేలా చూడటం చాలా గొప్ప విషయం. ఈ పేర్లు పిల్లలకి దైవ దీవెనలు అందిస్తాయని నమ్ముతున్నాను’’ అని చిరు ఎమోషనల్ అయ్యారు. మొత్తం మీద మెగా వారసుల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






