- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన సినిమా రీమేక్‌లో నాగార్జున..?
by Chukka Sudharani |
కింగ్ నాగార్జున ఇటీవల వచ్చిన సినిమా ‘ది ఘోస్ట్’. ఈ మూవీ అంచనాలకు భిన్నంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున ఇటీవల వచ్చిన సినిమా 'ది ఘోస్ట్'. ఈ మూవీ అంచనాలకు భిన్నంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో నాగ్ అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి వచ్చే సినిమాతో భారీ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారట నాగ్. ఈ మేరకు మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ''పోరింజు మరియం జోస్'' అనే సినిమాను రీమేక్ చేసే పనిలో నాగార్జున ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. 2019లో వచ్చిన ఈ సినిమాలో జోజు జార్జ్ చేసిన రౌడీ పాత్రనే తెలుగులో నాగ్ చేయబోతున్నారట. అంతే కాకుండా ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర నటించనున్నాడు. కాగా.. ఈ రీమేక్ సినిమాతో అయినా నాగ్ హిట్ కోడతారేమో వేచి చూడాల్సిందే.
Next Story






