Nagababu: అంజనమ్మ అస్వస్థతకు గురవడంపై స్పందించిన నాగబాబు.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే? (ట్వీట్)

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనమ్మ(Anjanamma) అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Nagababu: అంజనమ్మ అస్వస్థతకు గురవడంపై స్పందించిన నాగబాబు.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనమ్మ(Anjanamma) అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సైతం కేబినెట్ సమావేశం నుంచి వెంటనే హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఫోన్ రావడంతో కేబినెట్ సమావేశం జరుగుతుండగానే వచ్చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాటిని చూసిన మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, అంజనమ్మ కొడుకు నాగబాబు(Nagababu) ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఉదయం నుంచి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు ఆందోళన చెందవద్దు’’ అని అన్నారు. ప్రస్తుతం నాగబాబు ట్వీట్ వైరల్ కావడంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

Twitter link

Next Story