- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల విరామం తర్వాత నాగశౌర్య మాస్ ఎంట్రీ.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
యంగ్ హీరో నాగశౌర్య అభిమానులకు శ్రీరామనవమి రోజే ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

దిశ, సినిమా: యంగ్ హీరో నాగశౌర్య అభిమానులకు శ్రీరామనవమి రోజే ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో నాగశౌర్య చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకుని, ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక రెండు భయంకరమైన విగ్రహాలు ఉండటం, కొంతమంది నాగశౌర్యకు మొక్కుతున్నట్లు చూపించడం చూస్తుంటే.. ఈ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్నట్లు అర్థమవుతోంది. 'రంగబలి' వంటి ఫ్లాప్ తర్వాత నాగశౌర్య ఈసారి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.
దర్శకుడు రామ్ దేశిన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ హరీష్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంతేకాకుండా, నటనలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని సమాచారం. దాదాపు మూడేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నాగశౌర్య, ఈ వేసవిలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకోవడం విశేషం






