- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు లవ్ స్టోరీ రివీల్ చేసిన నాగచైతన్య.. అక్కడే మేము ఒకటయ్యామంటూ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సమంత(samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సమంత(samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక కొద్ది కాలం పాటు బాగానే ఉన్నప్పటికీ మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత చైతు, శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) తో కొద్ది కాలం పాటు డేటింగ్ చేశాడు. సీక్రెట్‌గా పలు వెకేషన్స్‌కు కూడా వెళ్లిన ఈ లవ్ బర్డ్స్ ప్రేమ విషయాన్ని బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ వారి రిలేషన్‌పై పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుకార్లు జోరందుకోవడంతో.. నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పెద్దలను ఒప్పించిన ఈ జంట గత ఏడాది పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
ఇక అప్పటి నుంచి శోభిత సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి బాధ్యతలు తీసుకుంది. చైతు మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో.. నెటిజన్లు లవ్ స్టోరీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య అభిమానుల కోరిక మేరకు తన ప్రేమ ఎక్కడ, ఎలా మొదలైందో వెల్లడించాడు. ‘‘మేము ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశాము. నా భాగస్వామిని అక్కడ కలుస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆమె పని గురించి నాకు బాగా తెలుసు. ఒక రోజు, నేను షోయు గురించి పోస్ట్ చేసినప్పుడు.. ఆమె ఒక ఎమోజి షేర్ చేసింది.
దీంతో నేను బుజ్జి తల్లి అని ముద్దుగా రిప్లై ఇచ్చాను. అప్పుడే నేను ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత, మేము కలిశాము పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత మా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. కానీ ‘బుజ్జి తల్లి’ పాట కారణంగా మాకు గొడవ జరిగింది.. తను నాపై కొద్ది రోజులు కోపంగానే ఉంది. ఎందుకంటే.. నిజానికి అది నేను ఆమెకు పెట్టిన ముద్దు పేరు. నేను దర్శకుడిని సినిమాలో ఉపయోగించమని అడిగానని ఆమె అనుకుని కొన్ని రోజులు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని మాట్లాడింది” అని చెప్పుకొచ్చాడు.






