‘Project K’నుంచి క్రేజీ అప్‌డేట్.. పూజ చేయించిన టైటిల్ కవర్‌ పోస్ట్ చేసిన డైరెక్టర్

by Dishanational2 |
‘Project K’నుంచి క్రేజీ అప్‌డేట్.. పూజ చేయించిన టైటిల్ కవర్‌ పోస్ట్ చేసిన డైరెక్టర్
X

దిశ, సినిమా : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ‘ప్రాజెక్ట్ కే’ మూవీ కామిక్ కాన్‌లో కూడా పాల్గొనబోతుందని, జూలై 20న సినిమాకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేస్తారని సమాచారం. కాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నెట్టింట ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ మేరకు ఒక పోస్టింగ్ కవర్‌ని పూజ చేయించి ఆ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘ఈ కవర్‌లో కేవలం ఒక పేపర్ ఒక సింగిల్ వర్డ్‌తో ఉంది. కానీ ప్రపంచమంతా బరువు ఈ కవర్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా ఒక్క వర్డ్‌లోనే టైటిల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చాడంటూ.. అది ఏమైవుంటుందని ఫ్యాన్స్ తెగ చర్చిస్తున్నారు.



Next Story

Most Viewed