- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రకాళి ఆలయంలో నభా నటేష్ .. ప్రత్యేక పూజల వెనుక అసలు కథ ఇదే
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) చాలా కాలం గ్యాప్ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా రాబోయే వేసవిసీజన్‌ను టార్గెట్ చేస్తూ ఏకంగా రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. నభా నటేష్ ప్రస్తుతం నాగబంధం, స్వయంభూ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో, విభిన్నమైన కథాంశాలతో రూపొందుతున్నాయి. విశేషమేమిటంటే, ఈ రెండు సినిమాలు కూడా దాదాపు ఒకే సమయంలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దీంతో నభా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ, తన కెరీర్‌కు ఈ రెండు సినిమాలు అత్యంత కీలకం కావడంతో ఆమె చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్స్ ముగింపు దశకు చేరుకోవడంతో ఆమె రేయింబవళ్లు కష్టపడుతూ ఫుల్ బిజీగా గడుపుతోంది. చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో నభా నటేష్ ఆధ్యాత్మిక బాట పట్టింది. తాజాగా, ఆమె తెలంగాణలోని ఆలయంలో దర్శనమిచ్చింది. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంది. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నభా, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది. తన రాబోయే రెండు పాన్ ఇండియా చిత్రాలు భారీ విజయాన్ని అందుకోవాలని, తన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా ఉండాలని ఆమె మనస్ఫూర్తిగా మొక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నభా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న నభాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈసారి నభా నటేష్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టేలా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.






