- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా' పక్కా హిట్ : మేకర్స్
by Chukka Sudharani |
దిశ, సినిమా : తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’.

X
దిశ, సినిమా : తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు కోదండ రామిరెడ్డి, సాగర్, ప్రసన్న కుమార్, గణేష్ మాస్టర్, వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, శశి ప్రీతమ్, తస్కిన్, ఉషారాణి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరారు. వెంకట్ వందెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై జి.వి.ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మించగా.. సందీప్ కుమార్ సంగీతం అందించాడు.
Next Story






