- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శంబాల’ నైజాం హక్కులు సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్..
వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar)లేటెస్ట్ సినిమా ‘శంబాల’(Shambhala).

దిశ, సినిమా: వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar)లేటెస్ట్ సినిమా ‘శంబాల’(Shambhala). ఈ సినిమాకు ‘ఎ మిస్టికల్ వరల్డ్’ అనేది ట్యాగ్ లైన్. యుగంధర్ ముని (Yugandhar Muni)దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్న భీమోజు, మహీధర్ రెడ్డి కలిసి షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శంబాలా జర్నీలో ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP భాగమైంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP ఈ చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.
‘శంబాల’ యూనిట్‌లో మైత్రీ వారు కూడా జాయిన్ కావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శంబాలా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ డిఫరెంట్ టైప్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్‌కి ఈ సినిమాను మరింత చేరువ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.






