- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా రెండు ప్రపంచాలు ఒకే చోటుకు చేరాయి.. గుడ్ న్యూస్ చెప్పిన నిహారిక (పోస్ట్)
మెగా డాటర్ నిహారిక(Niharika) నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తన మొదటి మూవీ ‘కమిటీ కుర్రాళ్ళు’ సూపర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika) నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తన మొదటి మూవీ ‘కమిటీ కుర్రాళ్ళు’ సూపర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం నిహారిక తన రెండో ప్రాజెక్ట్ మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్(Sangeet Shobhan)తో చేస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా పనులతో పాటు నిహారిక ఓ వంటల కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘‘నా రెండు ప్రపంచాలు ఒకే చోటుకు చేరాయి. ఒకటేమో కెమెరా ముందుకు వచ్చాను.. అందుకోసం తయారయ్యాను. డ్యాన్స్ చేశాను.. చాలా సరదాగా ఉన్నాను. మరొకటేమో నా ప్రొడక్షన్ హౌస్‌లో రెండు సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీకి సంబంధించిన పనులు చూసుకుంటున్నాను.
యాక్టింగ్, ప్రొడక్షన్ ఈ రెండూ నా చాలా ఇష్టం. వీటిల్లో ఏది ఎక్కువ అని చాలామంది అడుగుతుంటారు. నిజయితీగా నిజం చెప్పాలంటే నేను ఏదో ఒకదాన్ని అస్సలు ఎంపిక చేసుకోలేను. యాక్టింగ్ నా ఫ్యాషన్.. ప్రొడ్యూస్ చేయడం నేను ఎదగడానికి తోడ్పడింది. అందుకోసం నేను చాలా కష్టపడ్డాను కాబట్టి రెండు ముఖ్యంగా. నిన్న అదే రుజువైంది. మాటల్లో చెప్పకపోయినా చేతల్లో తెలిసిపోయింది. ఓ రియాలిటీ షోకు గెస్ట్‌గా వెళ్లి కెమెరా ముందు కనపడ్డాను. ఆ పక్కనే ఉన్న బిల్డింగ్‌లో ది ఎలిఫెంట్ పిక్చర్ ఆఫీసుకు వెళ్లి నిర్మాతగా వ్యవహరించాను. నా జర్నీ అంతా ఒక్కసారిగా కళ్లముందు తిరిగేసరికి మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు సూపర్ అని కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే తన రెండో సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది కావచ్చని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






