- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. తల్లికి క్షమాపణలు చెప్తూ షాకింగ్ వీడియో షేర్ చేసిన నిహారిక
మెగా డాటర్ నిహారిక (niharika)యాంకర్, హీరోయిన్‌గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. కానీ తన పర్సనల్ లైఫ్ వల్ల కొద్దికాలంపాటు సినిమాలకు దూరం అయింది.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక (niharika)యాంకర్, హీరోయిన్‌గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. కానీ తన పర్సనల్ లైఫ్ వల్ల కొద్దికాలంపాటు సినిమాలకు దూరం అయింది. మళ్లీ ఇటీవల ‘కమిటీ కుర్రోళ్లు’మూవీతో నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. మొదటి ప్రాజెక్ట్ సూపర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఫుల్ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా పలు అవార్డులను సైతం రాబట్టుకుంది. దీంతో నిహారిక ఇటీవల తన రెండో ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించింది. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్(Sangeet Shobhan)తో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించడంతో పాటు దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించింది.
అలాగే నిహారిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ షూట్ గ్యాప్ దొరికినప్పుడల్లా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. పొగ మంచులో చలికి వణుకుతూ.. జలపాతానికి దగ్గరగా వెళ్లి తడుస్తుంది. ఇక ఇందులో ఆమె జారి పడిపోబోతుండగా.. బ్యాలెన్స్ చేసుకుని కిందపడకుండా ముందుకు వెళ్లింది. ఈ పోస్ట్‌కు ‘‘నేను సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నా కోసం ప్రార్థిస్తే ఉంటుంది. కానీన నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను క్షమించు అమ్మ’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినీ సెలబ్రిటీలు ఫన్నీ రిప్లైలు ఇస్తుండగా.. నెటిజన్లు నీహా రాక్.. మమ్మీ షాక్ అని కామెంట్లు చేస్తున్నారు.






