నా భర్త అంటే మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు.. కాజల్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
నా భర్త అంటే మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు.. కాజల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే కాజల్ నటించిన ‘కార్తీక’ మూవీ విడుదలైంది.

తాజాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ అమ్మడు షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘గౌతమ్, నేను మంచి స్నేహితులం. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు. మా ఫ్రెండ్షిప్ ఏడేళ్లు కొనసాగింది. ఈ ఏడేళ్లలో అతని వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నాకు నేను ఏరోజు అతనికి చెప్పలేదు. అతనికి కూడా నేను అంటే ఇష్టం అంట. తను కూడా చెప్పలేదు. ఇక ఈ మూగ ప్రేమ కొనసాగుతున్న సమయంలో కరోనా వచ్చింది. ఆ సమయంలో మేము ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయాము. అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో విషయం చెబితే అమ్మ వెంటనే ఒప్పుకుంది. నాన్న ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని షాక్ ఇచ్చారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. మా ఇద్దరి వృత్తులు వేర్వేరు కావడంతోనే ఆయన అడ్డు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఎంతో సహాయం చేసింది. నాన్నను నిదానంగా ఒప్పించింది. ఇక ఇప్పుడు.. నాకన్నా గౌతమ్ తోనే నాన్న ఎక్కువ ఉంటున్నారు. కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వారి బాండింగ్ ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది’’ అంటూ వివరించింది.

Read more : వారికి బహిరంగ క్షమాపణలు చెప్పిన నటి కల్పిక.. వీడియో వైరల్



Next Story

Most Viewed