‘అభిమానుల ధైర్యమే నా బలం’.. అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-01 07:47:11  IST  )

న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రముఖులు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంచుకుంటున్నారు.

‘అభిమానుల ధైర్యమే నా బలం’.. అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రముఖులు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంచుకుంటున్నారు. కొందరు కొత్త ఏడాదికి రిసోల్యూషన్స్ తీసుకుంటూ సర్‌ప్రైజ్ ఇస్తుండగా.. ఐకాన్ స్టార్ (Allu Arjun) మాత్రం తనదైన శైలిలో హృదయాన్ని తాకే ఎమోషనల్ నోట్‌తో 2026కు స్వాగతం పలికారు. అభిమానులతో తన బంధాన్ని మరోసారి బలంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన ప్రతి దశ, ప్రతి మలుపు తనను ఒక మంచి మనిషిగా, మంచి నటుడిగా తీర్చిదిద్దిందని భావోద్వేగంగా తెలిపారు.

ఎన్నో విలువైన పాఠాలు

కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, కష్టకాలాల్లోనూ వెన్నంటే నిలిచిన ప్రేక్షకుల ప్రోత్సాహమే తనకు అండగా నిలిచిందన్నారు. ఈ ప్రయాణంలో తాను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా ఓర్పు, క్రమశిక్షణ, కృతజ్ఞత భావం తన జీవితంలో ముఖ్యమైన భాగాలయ్యాయని చెప్పారు. ప్రతి కీలక సమయంలో అభిమానులు ఇచ్చిన ధైర్యమే తనను ముందుకు నడిపించిందని, అదే నమ్మకం రోజూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని అల్లు అర్జున్ వెల్లడించారు. “మీరు ఇచ్చే ధైర్యమే నన్ను మరింత కష్టపడేలా చేస్తోంది” అంటూ అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అదే నా లక్ష్యం

తమ ప్రేమే తన జీవితానికి అర్థాన్ని ఇస్తోందని, అదే తనను ఇంకా మెరుగైన నటుడిగా మారేందుకు ప్రేరేపిస్తోందని అన్నారు. భవిష్యత్తు పట్ల ఎంతో ఆశావహంగా ఉన్నానని, ప్రేక్షకులు గర్వపడేలా మరిన్ని మంచి సినిమాలు అందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. 2026 సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్ ఈ ఎమోషనల్ పోస్ట్‌తో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

Next Story