- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగింటి అమ్మాయిలా వినాయకుడి పూజలు చేస్తున్న మృణాల్.. ధనుష్‌తో పెళ్లి కోసమేనా?
యంగ్ బ్యూటీ మృణాల్ (Mrunal Thakur)తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల ‘సన్ ఆఫ్ సర్దార్-2’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ (Mrunal Thakur)తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల ‘సన్ ఆఫ్ సర్దార్-2’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం డెకాయిట్, హై జవానీ తో ఇష్క్ హై(hai jawani to ishq hona hai) మూవీస్ చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మృణాల్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల నుంచి వీరిద్దరు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సన్నిహితంగా కనిపిస్తున్నారు. దీంతో పెళ్లి పుకార్లు జోరందుకున్నాయి. అయినప్పటికీ డేటింగ్ వార్తలపై మృణాల్, ధనుష్ (dhanush) స్పందించలేదు. ఇక నిత్యం వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈక్రమంలో.. తాజాగా, మృణాల్ వినాయకుడి పూజలు చాలా సాంప్రదాయ లుక్‌తో చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇందులో గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్‌డ్ చీర కట్టుకున్న మృణాల్ కాళ్లకు పట్టీలు కూడా పెట్టుకుంది. గార్జియస్ లుక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘గణేష్ చతుర్థి ఎల్లప్పుడూ నాకు స్పెషల్ పండుగ. ఇల్లు, భక్తి, ఆనందం సజీవంగా ఉండే సమయం. ఈ సంవత్సరం, పార్వతి దేవికి, దైవిక స్త్రీత్వం, శక్తి గణేశుడి వెనుక ఉన్న కృపకు గుర్తుగా ఉండే దుస్తుల ద్వారా నేను దానిని లోతైన సాంప్రదాయంగా, వ్యక్తిగతంగా భావించే విధంగా జరుపుకోవాలనుకున్నాను. బంగారు రంగులతో కమలం రంగులతో కప్పబడిన ఇది నాతో పాటు ఆమె ఆశీర్వాదాన్ని కలిగి ఉంది. కొంచెం బలం, కొంచెం ప్రేమ, చాలా విశ్వాసం పూజలు చేసాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక మృణాల్ ఫొటోలు చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ధనుష్‌తో పెళ్లి కోసమే పూజలు చేస్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు.






