Sreeleela: టాలీవుడ్ హీరో సినిమా నుంచి శ్రీలీలను తొలగించిన మూవీ మేకర్స్.. లక్కీగా తప్పించుకుందంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-25 08:55:00  IST  )

క్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ అవడంతో రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

Sreeleela: టాలీవుడ్ హీరో సినిమా నుంచి శ్రీలీలను తొలగించిన మూవీ మేకర్స్.. లక్కీగా తప్పించుకుందంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ అవడంతో రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ చిత్రంతో కంబ్యాక్ ఇవ్వనున్నారు. అయితే ఇందులో యంగ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ‘వినరో భాగ్యం విష్ణు’ కదా ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ (Naga Vamsi)నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత పూర్తి అవడంతో మూవీ మేకర్స్ ఇటీవల హీరో, హీరోయిన్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు.

దీంతో నెటిజన్లు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఈ సినిమా నుంచి శ్రీలీలను చిత్రబృందం తొలగించేశారని టాక్. శ్రీలీల అయితే అఖిల్ సరసన బాగుంటుందని, డ్యాన్స్‌లుగా బాగా చేయడంతో పాటు నటనతో అదరగొడుతుందని భావించి ఆమెను తీసుకున్నారట. కానీ ఆమె మాత్రం డేట్స్ అడ్జెస్ట్ చేయలేను అని చెప్పడంతో ఏం చేయలేక ఆమెను తొలగించారని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీ లీల కోసం షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న మూవీ మేకర్స్ ఆమె కోసం మరికొద్ది రోజుల టైమ్ తీసుకోవడం కంటే మరో అమ్మాయిని పెట్టాలని డిసైడ్ అయి హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు లక్కీగా తప్పించుకుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం మమిత బైజు, పూజా హెగ్డే, అనుపమ, భాగ్య శ్రీ బోర్సే ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా, శ్రీ లీల వరుస అవకాశాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రజెంట్ ఈ అమ్మడు హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ‘ఆషికి-3’ మూవీలో నటిస్తోంది. అలాగే తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర వంటి చిత్రాల షూటింగ్స్ ఫినిష్ చేస్తుంది. ఇక తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. link

Next Story