ఇండస్ట్రీలో నాకు భయంకరమైన అనుభవాలున్నాయి.. నీచులే ఎక్కువమంది

by Disha Web Desk 7 |
ఇండస్ట్రీలో నాకు భయంకరమైన అనుభవాలున్నాయి.. నీచులే ఎక్కువమంది
X

దిశ, సినిమా: నటి మోనా సింగ్ తన నటనా జీవితం ప్రారంభంలోనే కొన్ని భయానక సమావేశాలు, భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ‘నేను ఆడిషన్ కోసం పూణె నుంచి ముంబై వచ్చినప్పుడు చాలా అసౌకర్యానికి గురయ్యాను. నేను చాలా రకాల వ్యక్తులను కలిశాను. అందులో కొందరు విచిత్రంగా ఉన్నారు. ప్రత్యేకించి స్త్రీలు కూడా నీచమైన మనస్తత్వాన్ని కలిగివుండటం నేను గ్రహించాను. అయితే నేనెప్పుడూ వారి మాటలకు లొంగిపోలేదు. ఎందుకంటే ఇంటినుంచి బయటకు వచ్చిపుడే జీవితంలో ఏదైనా సాధించాలని బలంగా ఫిక్స్ అయ్యాను. దీంతో కొంతకాలం నగరంలో అమాయకంగా ఉన్నాను. నాకు నేను బలహీనురాలిగా అనిపించిన మళ్లీ బలంగా నిలబడ్డాను’ అని చెప్పింది. అలాగే ఈ రోజుల్లో సోషల్ మీడియాను చాలా శక్తివంతమైనదిగా పేర్కొన్న నటి.. మన పనిపై ప్రజల అభిప్రాయాన్ని తక్షణమే తెలుసుకుని తృప్తి పొందవచ్చని చెప్పింది. ‘ప్రతిరోజూ నేను దాదాపు వెయ్యి పాజిటీవ్ కామెంట్లను పొందుతున్నా. ఇదొక అందమైన అనుభూతి’ అని హ్యాపీగా ఫీల్ అయింది.

Next Story