Mohanlal: మోహన్ లాల్ 'రామ్' షూటింగ్ పున:ప్రారంభం

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-09 08:50:43  IST  )

Mohanlal 'Ram' Movie Shoot Resumes| మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'రామ్'. ఇందులో 'రా' ఏజెంట్‌గా కనిపించనున్న మోహన్ లాల్ భార్య పాత్రలో త్రిష నటిస్తోంది

Mohanlal Ram Movie Shoot Resumes
X

దిశ, సినిమా : Mohanlal 'Ram' Movie Shoot Resumes| మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'రామ్'. ఇందులో 'రా' ఏజెంట్‌గా కనిపించనున్న మోహన్ లాల్ భార్య పాత్రలో త్రిష నటిస్తోంది. 2019లోనే మొదలై విదేశాల్లో సగం వరకు షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడింది. అయితే ఇదే గ్యాప్‌లో సేమ్ కాంబినేషన్‌తో '12th మేన్' మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్లకు 'రామ్' సినిమాకు సంబంధించి మిగిలిపోయిన షూటింగ్‌‌ను శనివారం ప్రారంభించారు మేకర్స్. సాయికుమార్, ఆదిల్ హుస్సేన్, ఇంద్రజిత్ సుకుమారన్, దుర్గ కృష్ణ, సుమన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి విష్ణు శ్యామ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: శివుడి పాట పాడిన ముస్లిం యువతి.. లీగల్ ట్రబుల్స్ తప్పవా?

Next Story