- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teja Sajja: ‘మిరాయ్’ విడుదల వాయిదా.. ట్రైలర్ అప్డేట్ ఇస్తూ పవర్ ఫుల్ పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(teja sajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(teja sajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai). యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పురాణాల ప్రకారం అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో తొమ్మిది పవిత్ర గ్రంథాలను సృష్టించాడు. ఈ గ్రాంథాలను కాపాడే సూపర్ యోధాగా తేజ సజ్జ నటిస్తున్నాడు. అలాగే ఈ గ్రంథాలను దక్కించుకోవడానికి ప్రయత్నించే దుష్టశక్తిగా కనపించనున్నాడు. అయితే తేజ ఎలా మనోజ్‌ను ఎదుర్కొంటాడనేది ఈ మూవీ కథ.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘మిరాయ్’ సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకోగా.. ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, తేజ సజ్జా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన ప్రకటన చేశాడు. ‘మిరాయ్’ మూవీ ట్రైలర్ ఆగస్టు 28న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు. భవిష్యత్తు యుద్ధం చేసేందుకు వీరిద్దరు జన్మించారంటూ.. మంచు మనోజ్‌తో కర్రతో పోరాటం చేస్తున్న పవర్ పోస్టర్‌ను వదిలాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌లో చెప్పి మేకర్స్ అందరికీ బిగ్ షాకిచ్చారు. అయితే సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి ఉండటంతో సోలో డేట్‌తోనే రిలీజ్ చేయాలని ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ స్పష్టం చేశారు.






