బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన తేజ సజ్జా.. ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన ‘మిరాయ్’

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ‘మిరాయ్’ (Mirai)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన తేజ సజ్జా.. ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన ‘మిరాయ్’
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ‘మిరాయ్’ (Mirai)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అయితే ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా.. శ్రియా శరణ్, మంచు మనోజ్(Manchu Manoj), జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్ రాబడుటూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది.

ఈక్రమంలో.. తాజాగా, మేకర్స్ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే పోస్ట్ పెట్టారు. ‘మిరాయ్’ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు ప్రకటించారు. టికెట్ రేట్లు పెంచకుండానే అతి తక్కువ సమయంలో ‘మిరాయ్’ భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం. పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న తేజ సజ్జా రెండవ చిత్రంగా ‘మిరాయ్’ నిలిచింది. ఈ చిత్రం బుక్‌మైషోలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నిన్ననే 1 లక్ష టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అదనంగా, మిరాయ్ యుఎస్ బాక్సాఫీస్ వద్ద $2 మిలియన్ల మార్కును అధిగమించింది. దీంతో నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు మూవీ టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

link

Next Story