- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ దర్శకధీరుడిపై ప్రశంసల వర్షం కురిపించిన మిల్క్ బ్యూటీ
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ అమ్మడు స్టార్ గుర్తింపు సంపాదించుకుంది. ‘హ్యాపీడేస్, ఎందుకంటే ప్రేమంట, ఊసరవెల్లి, రెబెల్, ఆవారా, రచ్చ, అభినేత్రి 2, భోలా శంకర్, బాహుబలి, 100 %లవ్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లోనే కాకుండా ఈ అమ్మడు వెబ్ సిరీస్‌ల్లో కూడా మెరిసింది.
తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి బహు గొప్పగా చెప్పుకొచ్చింది. పొగడ్తల వర్షం కురిపించింది. ‘రాజమౌళికి ఒక సినిమాకు ఎంత పెట్టుబడి పెట్టాలో, ప్రేక్షకులకు ఏ విధంగా అయితే స్టోరీ నచ్చుతుందో ఆయనకు పూర్తిగా తెలిసి ఉంటుంది. నటీనటులు సెట్స్ పైకి రాకముందే జక్కన్న యాక్షన్ అయినా డాన్స్ సీక్వెన్స్ అయినా రిహార్సల్ చేస్తారు. బాహుబలి సినిమా షూటింగ్ అప్పుడు ఆయనే నాకు విల్లు, బాణం ఎలా ఉపయోగించాలో నేర్పించారు. నా లైఫ్ లో నేను కత్తి కూడా ఎప్పుడు టచ్ చేయలేదు. స్విట్జర్లాండ్‌లో సూపర్ స్టార్‌తో షూటింగ్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ బాహుబలి సెట్‌కి వెళ్లాను. అందులో చివరగా నటించిన పర్సన్ ను నేనే. బాహుబలి మూడు సంవత్సరాలు చిత్రీకరించబడింది. కొద్ది సమయంలోనే రాజమౌళి నాకు చాలా విషయాలు నేర్పించారు’ అంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.