‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. లిరిక్స్‌కు ఫిదా అయిపోతున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-26 06:33:19  IST  )

సంతోష్ శోభన్ (Santosh Shobhan)హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’.

‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. లిరిక్స్‌కు ఫిదా అయిపోతున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: సంతోష్ శోభన్ (Santosh Shobhan)హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రంలో మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly) సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారు. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

నేడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా నుంచి ‘నాలో నేను’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కొత్త స్టైల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. సంజిత్ హెగ్డే పాడారు. 'నాలో నేను' పాట ఎలా ఉందో చూస్తే - నాలో నేను, తనలో తాను, కలిసే ఉన్నాం విడిగా, కాలమా కాలమా ఈవేళని తెల్లవారినీకమ్మా, దూరమా దూరమా రెప్పపాటులో మాయమై పోమ్మా, ఇందాక చేరుకుంది ఇందుకేనా, ఇంతేనా కాలమంతా మౌనమేనా..అంటూ మెలోడియస్‌గా సాగుతుంది. ఇక ఈ సాంగ్ విన్న నెటిజన్లు వావ్, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story