మాస్ సాంగ్‌తో మెగాస్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!

by Disha Web Desk 6 |
మాస్ సాంగ్‌తో మెగాస్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో ‘భోళా శంకర్’. ఇందులో కథానాయికగా తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. దీనిని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇటీవల చిరంజీవి డబ్బింగ్ కూడా పూర్తి చేశారు.

తాజాగా, ఈ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు 4.5 నిమిషాలకు ‘జం జం జజ్జనక’ సాంగ్ ప్రోమో విడుదల చేసి.. జూలై 11న సాంగ్ మొత్తాన్ని విడుదల చేస్తామని తెలిపారు. అంతేకాకుండా చిరు మాస్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: మిమ్మల్ని ‘గే’ అంటున్నారు నిజమేనా? థ్రెడ్స్ యాప్‌లో కరణ్‌కు షాకిచ్చిన నెటిజన్..

Next Story

Most Viewed