Megastar Star Chiranjeevi పెళ్లి పత్రికను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

by Hamsa |
Megastar Star Chiranjeevi పెళ్లి పత్రికను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా రానిస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి బాక్సాఫీసును బద్దలు కొట్టి చెరగని ముద్ర వేసుకున్నారు. చిరు మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా యంగ్ హీరోలతో పోటీపడి మరీ వరుస చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

అయితే చిరంజీవి అల్లు రామలింగయ్య గారి అల్లుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు రామలింగయ్ చిన్న కూతురు సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. 1980లో ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. వీరి పెళ్లి జరిగి 42 ఏళ్ళు పూర్తి అయింది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి సురేఖ పెళ్లి పత్రిక ఇంగ్లీష్ అక్షరాలతో స్టైల్ ఫాంట్‌తో ప్రింట్ అయి ఉన్న పెళ్లి పత్రికను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.



Next Story