టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ.. పవన్ కళ్యాణ్ గెలుపు పై సర్వత్రా ఆసక్తి!

by Jakkula Samataha |

ప్రస్తుతం అందరి నోట జనసేనాని మాటే వినిపిస్తోంది. మరికొద్ది గంటల్లో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలియనుంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆసక్తిగా ఎదురు

టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ.. పవన్ కళ్యాణ్ గెలుపు పై సర్వత్రా ఆసక్తి!
X

దిశ, సినిమా : ప్రస్తుతం అందరి నోట జనసేనాని మాటే వినిపిస్తోంది. మరికొద్ది గంటల్లో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలియనుంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు,జనసేనాని ఎంత మెజార్టీతో గెలుస్తారో చూడాలని వారు ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే పిఠాపురంలో ఎన్నడూ లేని విధంగా 86.63శాతం పోలింగ్ నమోదైంది. అంతే కాకుండా సర్వేలన్నీ కూడా పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ గెలుపు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఎందుకంటే ఆయన గెలుపు కోసం చిత్ర పరిశ్రమ ఓ యుద్ధమే చేసిందని చెప్పాలి. జబర్దస్త్ కమెడియన్స్, మెగా ఫ్యామిలీ మెంబర్స్, చిరు భార్య, నాగబాబు భార్య, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది పవన్ గెలుపుకోసం ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం టెన్షన్‌లో ఉన్నట్లు సమాచారం. ఆయన గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఎంత మెజార్టీతో గెలుస్తాడు? ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుందోని వారు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఆయన ప్రత్యర్థి వంగా గీతపై 100ఓట్ల మెజారిటీతో పవన్ ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story