గార్జియస్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా డాటర్..ఆనందం ప్రారంభమైందంటూ నిహారిక పోస్ట్

by Mallepaka Hamsa |

మెగా డాటర్ నిహారిక (niharika) నిర్మాతగా లైఫ్ లీడ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

గార్జియస్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా డాటర్..ఆనందం ప్రారంభమైందంటూ నిహారిక పోస్ట్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక (niharika) నిర్మాతగా లైఫ్ లీడ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన మొదటి సినిమా ‘కమిటి కుర్రోళ్లు’ (Committee Kurrollu)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తన సెకండ్ చిత్రాన్ని కూడా తెరకెక్కించే పనిలో పడింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. నిత్యం తన ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కు వెళ్తున్న నిహారిక తీరిక లేకుండా గడుపుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఓ నదిలో తన అందచందాలను ఆరబోసింది. పింక్ కలర్ చీరలో గులాబీ పువ్వులపై నిల్చొని ఉన్న ఆమె పక్కన చెలికత్తెలు కూడా ఉండటం విశేషం.

అలాగే మరో ఫొటోలో నీటిలోకి దిగి తామర పువ్వులను పట్టుకుని పోజు పెట్టింది. ఇక ఈ పోస్ట్‌కు నీరు తన పేరును మరచిపోయినప్పుడు.. ఆనందము ప్రారంభమవుతుంది అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు గార్జియస్, బ్యూటిఫుల్, మ్యాజికల్ అంటూ అమ్మడుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా.. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గానే కాకుండా.. నిర్మాతగానూ రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు సైతం దగ్గరగా ఉంటోంది. నిత్యం పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

Next Story