- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మాస్ మహారాజా..
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల (Sreeleela)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara).

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల (Sreeleela)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). ఈ సినిమా ఆయన కెరీర్‌లో 75వ ప్రాజెక్ట్‌గా రాబోతుండటం విశేషం. భాను భోగవరపు (Bhanu Bhogavarapu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. వాయిదాలు పడుతూ మాస్ మహారాజా అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఈక్రమంలోనే చిత్రబృందం ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది. కానీ మళ్లీ కొత్త డేట్‌ను మాత్రం వెల్లడించలేదు.
దీంతో రవితేజ అభిమానులు అసలు ‘మాస్ జాతర’ చిత్రాన్ని రిలీజ్ చేస్తారా? లేదా అని సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ రవితేజ, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఫన్నీగా మాట్లాడుకున్న వీడియోను షేర్ చేస్తూ ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక ఇందులో హైపర్ ఆది వచ్చి అన్నా మాస్ జాతర బాగా వస్తుంది రిలీజ్ ఎప్పుడని అడగ్గా.. సంక్రాంతికి అని అంటారు. ఆ తర్వాత మళ్లీ నిరాశగా వచ్చి పండుగ అయిపోయింది అనగా.. ఆది సాంగ్ షూట్‌లో హ్యాండ్‌కి దెబ్బ తగలడం వల్ల సర్జరీ అయింది.. మే 9న అని అంటాడు.
మళ్లీ వచ్చి సమ్మర్ కూడా అయిపోయింది విడుదల కాలేదంటే.. కాలుకి దెబ్బ తగిలిందని రవితేజ కవర్ చేస్తాడు. ఆ తర్వాత వినాయక చవితికి అనడంతో.. ఆది మళ్లీ రావండోత అన్ని పండుగలు అయిపోయాయి.. ‘మాస్ జాతర’ ఇంకెప్పుడు విడుదలవుతుంది.. అని ప్రశ్నార్థకంగా ముఖం పెడతాడు. ఈక్రమంలో.. రవితేజ ఓ కాల్ మాట్లాడి.. కచ్చితంగా మా సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతుంది అని వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






