ఎంతోమంది హీరోలు ఆ స్టార్ హీరోయిన్‌లా చేయాలనుకుంటారు.. ఆమెను చూస్తే గర్వంగా ఉందంటున్న మాధవన్

by Mallepaka Hamsa |

స్టార్ హీరో మాధవన్ (Madhavan)ఓ స్టార్ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమె నటనను పొగుడుతూ అందరూ తనలాగే ఉండాలనుకుంటారని ఆకాశానికెత్తేశారు.

ఎంతోమంది హీరోలు ఆ స్టార్ హీరోయిన్‌లా చేయాలనుకుంటారు.. ఆమెను చూస్తే గర్వంగా ఉందంటున్న మాధవన్
X

దిశ, సినిమా: స్టార్ హీరో మాధవన్ (Madhavan)ఓ స్టార్ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమె నటనను పొగుడుతూ అందరూ తనలాగే ఉండాలనుకుంటారని ఆకాశానికెత్తేశారు. ప్రియాంక చోప్రా నటించిన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’(Heads of State) మూవీపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘ప్రియాంక (Priyanka Chopra)అక్కడికి వెళ్లి అంత పెద్ద హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రను సులువుగా పోషించింది. సినిమాలో ఆమె యాక్షన్ చేసింది. ఇండియాలో ఎంతోమంది హీరోలు ఆమె స్థానంలో ఉండి అలాంటి మూవీలో నటించాలని కోరుకుంటారు. ఆమెతో పాటు తనను తాను ముందుకు తీసుకెళ్లే తీరుకు నేను పెద్ద అభిమానిని అయిపోయాను.

ప్రియాంకను చూసి నేను చాలా గర్వపడుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, మాధవన్ ‘ఆప్ జైసా కోయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాధవన్ ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’లో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story